WhatsApp Image 2024 03 29 at 17.40.54
సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర మూడో రోజు కర్నూలు జిల్లాలో ప్రారంభం కానుంది. పెంచికలపాడు నుంచి ప్రారంభమైన సీఎం జగన్ బస్సు యాత్ర.. భారీ జనం మధ్య కొనసాగుతోంది. పెంచికలపాడు శిబిరం నుంచి తమ ప్రాంతానికి వస్తున్న జగన్ యాత్రకు స్వాగతం పలుకుతున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్
జగన్ యాత్రకు స్వాగతం పలుకుతున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ బస్సు దిగి ప్రజలను అప్యాయంగా పలకరిస్తున్నారు. సీఎం జగన్ కు వారి సమస్యలను పరిష్కరించాలని కోరగా.. సానుకూలంగా స్పందిస్తూ… వెంటనే అధికారులను ఆదేశిస్తున్నారు.
పలు ప్రాంతాల్లో జగన్ కు జనం నీరాజనం పలుకుతూ .. జై జగన్ అంటూ నినాదాలు చేస్తున్నారు. మొత్తంగా.. జనంతో మమేకం అవుతూ, జనం సమస్యలు తెలుసుకుంటూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఆరా తీస్తూ సాగుతోంది సీఎం జగన్ బస్సు యాత్ర.
