వరంగల్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధికారిక నివాసం వైట్ హౌస్ లో ఏషియన్ అమెరికన్ పసిఫిక్ ఐస్లాండ్ హెరిటేజ్ సదస్సులో వివిధ దేశాల 50 మంది ప్రతినిధులను ఆహ్వానించారు. నగరంలోని వరంగల్ ఒయాసిస్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్. జె.ఎస్. పరంజ్యోతి కుమారుడు యూనివర్సిటీ సౌత్ ఫ్లోరిడా అసిస్టెంట్ ప్రొఫెసర్ జన్ను చిరంజీవి భరత్ కు ఆహ్వానం అందింది అమెరికా ఉపాధ్యక్షుడి భార్య ఉషా బాలా చిలుకూరి వ్యాన్స్ కార్యక్రమానికి ముఖ్య అతిథి హాజరైనారు ఈ మేరకు జన్ను చిరంజీవి భరత్ గురువారం ఆహ్వాన వేడుకకు హాజరయ్యారు,
ఈ కార్యక్రమంలో జన్ను చిరంజీవి భరత్ మాట్లాడుతూ భారతీయ వారసత్వ సంపద గూర్చి పలు అంశాలను ప్రతినిధులకు వివరించారు వైట్ హౌస్ లో జరిగే అధికారిక ఆహ్వానం విదేశీ నేతలకు గౌరవంగా ఒక ప్రత్యేక కార్యక్రమం అని జన్ను భరత్ తెలిపారు వైట్ హౌస్ ఆహ్వానం అనేది అమెరికన్ రాజకీయ సామాజిక జీవితంలో ఒక ముఖ్యమైన అంశమని ఇది విదేశీ నేతలతో సంబంధాలను బలోపేతం చేయడానికి దేశంలోని వివిధ ప్రజలకు ఒక వారధిగా పనిచేస్తుందని దానికి తనను ఆహ్వానించడం చాలా సంతోషదాయకమని జన్ను చిరంజీవి భరత్ తెలిపారు ఈ ఆహ్వానం పట్ల నగరంలోని ప్రముఖులు పలు దేశాల మిత్రులు భరత్ కు అభినందనలు తెలిపారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


