Waqf Act : వక్ఫ్ చట్టాన్ని రద్దు చేయాలి

TRINETHRAM NEWS
  • రాజమహేంద్రవరం లోని అన్ని మసీదులలో ఉన్న ముస్లిం యువకులు భారీ ర్యాలీ
  • రాజమహేంద్రవరం ముస్లిం జెఎసి ఆధ్వర్యంలో ఆందోళన

రాజమహేంద్రవరం : రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ చేసిన వక్ఫ్ సవరణ చట్టాన్ని రాజమండ్రి ముస్లిం ఐక్య వేదిక తీవ్రంగా ఖండించింది. శుక్రవారం రాజమహేంద్రవరం ఆజాద్ చౌక్ లో ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం నగరం లో ఉన్న అన్ని మసీదులలోని ముస్లిం యువకులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం జేఏసీ కన్వీనర్ హబీబుల్లాఖాన్, మాట్లాడుతూ ముస్లింల పూర్వీకులు దేవుని పేర దానం చేసిన భూములను కబళించి కార్పొరేట్లకు దోచి పెట్టేందుకు కేంద్రం వక్ఫ్ చట్టం పేరుతో కుట్ర చేస్తుందని విమర్శించారు.

చీణారా భాగస్వామ్యపక్షాలు ముస్లింలకు ద్రోహం చేశాయని అన్నారు. ముస్లింల అభివృద్ధి కొరకే ఈ చట్టం తెస్తున్నామంటున్న భాజపా గత పదేళ్ళుగా ఒక ముస్లిం కి మంత్రి పదవి ఎందుకివ్వలేదు అంటే సమాధానం లేదని ఎద్దేవా చేశారు. కొన్ని పార్టీలు తామేదో ఈబిల్లుని ముస్లింలకి అనుకూలంగా మార్చేశామని ఊదరగొడుతున్నారని పేర్కొన్నారు. కానీ కొత్త చట్టం ద్వారా తీసుకొచ్చిన ప్రతి మార్పూ ముస్లింలకు వ్యతిరేకమని, వక్ఫ్ బోర్డును బలహీన పరిచేదేనని ఆందోళన వ్యక్తం చేశారు.
అందుకే ఈ చట్టాన్ని వెనక్కి తీసుకునేదాకా పోరాడతామని హెచ్చరించారు. కో కన్వీనర్ అహ్మద్ అన్సర్ మాట్లాడుతూ లిమిటేషన్ చట్టాన్ని వర్తింపచేయడం ద్వారా అన్యాక్రాంతమైన లక్షలాది ఎకరాల భూములను శాశ్వతంగా కోల్పోతాని అన్నారు. కోల్పోయిన భూములను చంద్రబాబు ఎలా తెచ్చిస్తారో చెప్పాలని ప్రశ్నించారు. అందుకే “ఈచట్టాన్ని వెనక్కి తీసుకునే వరకు మాఈ శాంతియుత పోరాటం కొనసాగుతుందని అన్నారు. ప్రాక్టీసింగ్ ముస్లిమే వక్ఫ్ బోర్డు కు దానం చేయాలి అని కొత్త చట్టంలో ఉందని దానిని ఎవరైనా దానం చేయవచ్చని మార్చాలని డిమాండ్ చేశారు. లేకపోతే వక్ఫ్ కి ఆదాయం తగ్గి బలహీనమై పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఉన్న దానినే యధాతథంగా ఉంచాలని కోరారు.
లిమిటేషన్ చట్టం వక్ఫ్ కు వర్తింపచేశారని
ఈ విధానం వలన ఆక్రమించుకోబడిన లక్షలాది ఎకరాల ఆస్తులను శాశ్వతంగా కోల్పోవలసి వస్తుందని తెలిపారు. బొహ్రా, ఆగాఖానీలకు వేరే వఫ్ఫ్ బోర్డు ఏర్పాటు చేశారని, ఇది ముస్లింలలోని ఐక్యతను దెబ్బతీసేందుకు బిజెపి ప్రభుత్వం కుట్ర చేసిందని ఆరోపించారు. దీనిని తిరస్కరిస్తూన్నామని అన్నారు. వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన అనేక చిక్కుముళ్ళు ఉన్నాయని పేర్కొన్నారు. దశాబ్దాల తరబడి కొనసాగుతున్న వివాదాలు ఆరునెలలు లేదా ఒక సంవత్సర కాలంలో పరిష్కరించబడవని తెలిపారు. ఒక సంవత్సర కాలంలో పరిష్కరించబడకపోతే రిజిస్ట్రేషన్ కాదని, ఆ సాకుతో ఆ భూములను ప్రభుత్వం ఆక్రమించుకుంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏదైనా ఆస్థిని వక్ఫ్ గా గుర్తించే ప్రాసెస్ కఠినతరం చేశారని అన్నారు.
ఈ కారణంగా ఇక ఏ భూమీ అదనంగా వక్స్ ఆస్తులలో కి చేరదని కనుక దీనిని తిరస్కరించాలన్నారు. సెక్షన్ 40 రద్దుతో వక్ఫ్ ను బలహీన పరిచారని వివరించారు. దీనితో ఇక ఏ ఆస్ధిని వక్ఫ్ ఆస్తిగా డికేర్ చేసే అర్హత బోర్డు కు ఉండదని అన్నారు. దీని వలన స్వంత ఆస్తులను కూడా వక్ఫ్ తన ఆస్తిగా ప్రకటించుకోలేని బలహీనమైన వ్యవస్థ అయిపోతుందని అన్నారు. వక్ఫ్ బోర్డుకు చెల్లించాల్సిన సాలీనా కాంట్రిబ్యూషన్ 5 శాతం మాత్రమేనని అన్నారు. వక్ఫ్ బోర్డు ఆదాయానికి గండి కొట్టే విదానమని అన్నారు. దీనిని యాధావిధిగా 7 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. వక్ఫ్ ట్రిబ్యునల్ అధికారాలు పరిమితం చేయబడ్డాయని తెలిపారు. ఇది కుట్ర పూరితమైన ప్రొవిజన్, ట్రిబ్యునల్స్ లో వివాదాలు త్వరితగతి పరిష్కరించబడతాయని, రివ్యూ కోసం హైకోర్టు, సుప్రీంకోర్ట్ లకు వెళితే ఏ వివాదమూ తేలదని అన్నారు.

ఆరు నెలలలోగా తేలకపోతే అది ప్రభుత్వ ఆస్థిగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు .అనేక అంశాల మూలంగానే దేశ ప్రజలు ప్రభుత్వం చేస్తున్న అన్ని సవరణలను కాదని యధావిధిగా పాత చట్టాన్నే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో ముస్లిం ఐక్యవేదిక యువకులు ఎండి అన్సర్, కే సల్మాన్, ఎండి అక్రమ్, ఎం డి.ఆరిఫ్ ఉల్లా ఖాన్, కలీం, సైఫ్, అమీర్, ఇర్ఫాన్, వాసిమ్, అన్వర్, జీలాని, రబ్బాని , రమీజ్, సిద్ధిక్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Waqf Act should be repealed

You cannot copy content of this page

Scroll to Top