Vyalla Harish Reddy : ఖనిలో జాతీయ జెండా ఆవిష్కరించిన వ్యాళ్ల హరీష్ రెడ్డి

TRINETHRAM NEWS

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో బిఆర్ఎస్ నాయకులు ఆధ్వర్యంలో శుక్రవారం ఎర్పాటు చేసిన 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి పాల్గోని జాతీయ పతాకావిష్కరణ చేశారు. అనంతరం స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా హరీష్ రెడ్డి మాట్లాడుతూ, ఎందరో మహానుబావుల త్యాగ ఫలితమే దేశ స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. అదే స్ఫూర్తితో తెలంగాణ యువకుల ఆరాధ్య దైవం కేసిఆర్ ఆలోచన రూపకల్పనతో శాంతియుత ఉద్యమం ద్వారా తెలంగాణ సాధించుకున్నామని, అభివృద్ధి చేస్తున్న సమయంలో అబద్ధాలు హామీలతో గద్దెనెక్కిన రేవంత్ సర్కార్ తెలంగాణ ప్రజలను రైతులను హామీలు అమలు చేయక నట్టేట ముంచిందని ఆరోపించారు.

రామగుండం నియోజకవర్గం లో కూడా పేద ప్రజల వైద్యానికి 500 కోట్ల రూపాయలతో వైద్య కళాశాల అనుబంధంగా ఆసుపత్రి నిర్మాణంతో ఈ ప్రాంత ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు కృషి చేశారని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు పరచక కాంగ్రెస్ ప్రభుత్వం చతికిల పడ్డదని ఇంకా మాయమాటలు చెప్పేందుకు ప్రయత్నిస్తుందని అన్నారు. తిరిగి బంగారు తెలంగాణ సాధనకు కెసిఆర్ మరోమారు ముఖ్యమంత్రి కావడమే తెలంగాణ ప్రజల ముందున్న కర్తవ్యం అని ఆ దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.రామగుండం మాజి ఆప్షన్ నెంబర్ తస్నిమ్ భాను జాహిద్ పాషా, పోలాడి శ్రీనివాసరావు, నడిపెల్లి సాయికుమార్, అనుముల కళావతి, పర్స స్వాతి, కొండ సురేష్, బూరుగు వంశీకృష్ణ, ఉస్మాన్, మోబిన్, పోయిల రవి, ఉదయ్, కడార్ల శ్రీధర్, రోడ్డ సంపత్, గుంపుల లక్ష్మి, అల్లి గణేష్, షరీఫ్, వాసాల రమేష్, శ్యామ్, యుగంధర్, మోయిన్ తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Vyalla Harish Reddy

You cannot copy content of this page

Scroll to Top