WhatsApp Image 2024 10 19 at 18.20.19
టిపిటిఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఓటర్ అవగాహన సదస్సు
ముఖ్యఅతిథిగా ఆవుల రాజేష్ యాదవ్ జిల్లా అధ్యక్షులు
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
గోదావరిఖని శారదానగర్ లోని సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం పెద్దపల్లి జిల్లా ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ నమోదు అవగాహన కార్యక్రమానికి పెద్దపల్లి జిల్లా టిపిటిఎఫ్ అధ్యక్షులు ఆవుల రాజేష్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ మరియు నిరుద్యోగ యువతీ యువకులు మరియు వివిధ రంగాల్లో పనిచేసేటువంటి పట్టభద్రులు,అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని తప్పనిసరిగా ఓటు హక్కును ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్లో గాని నమోదు చేసుకోవాలని,ఇది ప్రత్యేకమైనటువంటి ఎలక్షన్ చదువుకున్న వారు మాత్రమే వేయగలిగే ఓటు అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రాడ్యుయేట్స్ టీచర్స్ ఎమ్మెల్సీ ఓటర్ నమోదు అవగాహన సదస్సులు నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో టి పి టి ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ మూర్తి, పత్తి రాజి రెడ్డి ,పాఠశాల కార్యదర్శి దుర్గా ప్రసాద్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
