త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం గుమ్మడిపల్లి గ్రామంలో అంగన్వాడి సెంటర్ 1 టీచర్ నిర్మల కుమారి అంగన్వాడి సెంటర్ 2 టీచర్ తాటి లక్ష్మి సెంటర్లకుతాళాలు వేసిన గ్రామస్తులు
వివరాల్లోకి వెళితే,గ్రామస్తులు పుట్ట సత్యం మాట్లాడుతూ అంగన్వాడి సెంటర్ నందు టీచర్స్ పిల్లలకు, గర్భిణీలకు బారింతలకు ఫీడింగ్ సరిగా అందడం లేదని బియ్యం, నూనె, కోడిగుడ్లు అమ్ముకుంటున్నారని. గతంలో చాలాసార్లు జరిగిందని. సిడిపిఓ కి కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా వీరిలో మార్పు రాలేదు గర్భిణీలు, బాలింతలు, పిల్లలు సరిగా రాకపోయినా వారి రిజిస్టర్లో వచ్చినట్టుగా రాసుకొని రికార్డు చూపించి సరిగా ఉన్నాయని చెప్పడం కోసమెరుపు సిడిపిఓని వివరణ కోరగా వారి మీద చర్య తీసుకుంటానని చెప్పారు.
ఈ కార్యక్రమంలో సిమ్మడ బోయిన వెంకటేశ్వరరావు, సాధన రాజారావు, డేరంగుల సంతోష్, తుమ్మల నాగేశ్వరరావు, సాయల వీరబాబు, కొప్పుల చెన్నారెడ్డి, పదిలం సత్తిబాబు, డేరంగుల రాంబాబు, ముత్యాలు, వెంకయ్య గ్రామస్తులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


