మీలో ఒకడిగా మీ ముందుకు వస్తున్న. -మీ ఆశీస్సులు మద్దతుతో మంచి మార్పు తీసుకుని వస్తా.
పాలకుడిగా కాక మీ సేవకుడిగా మీ ముందుకు. డిండి గుండ్ల పల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి : గిరమోని శ్రీనివాస్.
డిండి ( గుండ్లపల్లి) డిసెంబర్ 12 త్రినేత్రం న్యూస్. డిండి గ్రామ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గిరమోనిశ్రీనివాస్ మండల కేంద్రంలో ఇంటింటికి ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ గ్రామాన్ని ఆదర్శవంతమైన గ్రామంగా అభివృద్ధి చేయడమే తన ప్రధాన లక్యం అని పేర్కొన్నారు. గ్రామ ప్రజలందరూ కలిసికట్టుగా ఉంది సర్పంచ్గా గెలిపించాలని కోరారు.
గ్రామ ప్రజలకు అన్ని విధాలుగా అందుబాటులో ఉంటూ గ్రామ సేవే లక్ష్యంగా పనిచేస్తానని గ్రామ అభివృద్ధి పట్ల నా నిబద్ధతతో మంచి మార్పు తీసుకురావడమే నా లక్ష్యంగా పనిచేస్తానని వారు తెలిపారు. గ్రామాభివృద్ధి పారదర్శక పాలన ప్రజల సమస్యలను ప్రధానంగా పరిష్కరించే దిశగా పనిచేస్తానని వారు ధీమా వ్యక్తం చేశారు. గ్రామ ప్రజలందరూ ఉంగరం గుర్తు పై ఓటు వేసి అత్యధికమెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


