Digging Pits : ఏ కన్నూ చూడని మన్ను

TRINETHRAM NEWS

జె సి బి ల సహాయంతో గుట్టలు తవ్వి మట్టి అక్రమ తరలింపు.
రెవెన్యూ , అటవీ శాఖ, ఇరిగేషన్, మైనింగ్ శాఖల అధికారుల నిర్లక్ష్యం.
మట్టి దళారులు ఇష్టాను సారంగా గుట్టలను తవ్వి అక్రమంగా మట్టిని తరలింపు.

ప్రభుత్వ ఆదాయానికి దళారులు గండి.

డిండి (గుండ్లపల్లి) డిసెంబర్ 12 త్రినేత్రం న్యూస్. డిండి మండల పరిధిలోని చెరుకుపల్లి గ్రామంలో మట్టిని తవ్వి అక్రమంగా తరలిస్తు న్నారు. రెవెన్యూ , అటవీ శాఖ ఇరిగేషన్ మైనింగ్ శాఖల అధికారులు సమన్వయంతో దాడులు చేయాల్సిన అవి జరగడం లేదు కొన్ని గుట్టలను తవ్వి అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు. ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా ఇష్టానుసారంగా గుట్టలను తవ్వేస్తున్నారు మట్టి అక్రమ తరలింపు సాగుతోంది గ్రామీణ ప్రాంతాల్లోనే గుట్టలు కనుమరుగుతున్నాయి అక్రమాలను ఆపాల్సిన అధికారులు పట్టించుకోవడంలేదని దీని ఆసరాగా చేసుకొని అక్రమార్కులు చెలరేగిపోతున్నారు పట్టా భూముల ముసుగుతో ఇష్టానుసారంగా గుట్టల్ని తొవ్వేస్తున్నారు ఇలాంటి పరిస్థితి దేవరకొండ నియోజక వర్గంలోని డిండి గుండ్లపల్లి మండలంలో నెలకొంది మట్టి మాఫియా దాహానికి కొండలు కనుమరుగవుతున్నాయి.
మండల వ్యాప్తంగా అక్రమ మట్టి తరలింపు భారీగానే సాగుతోంది మట్టి తరలింపు లో ట్రాక్టర్ డ్రైవర్లు అతివేగంతోప్రయాణిస్తున్నారు. వచ్చే పోయే ప్రయాణికులకు ఇతర వాహనాలకు కానీ దారి ఇవ్వకుండా ప్రజల అవసరాలకు అంతరాయం కలిగిస్తున్నారు. జెసిబిల సహాయంతో ట్రాక్టర్ల కు అధికంగా మట్టిని వేయడంతో అది కాస్త రోడ్డుపై పడి ప్రయాణికుల ప్రమాదాలకు నిలయం అవుతున్నాయి అని ప్రజలు వాపోతున్నారు. మండల పరిధిలోని అటవీ రెవెన్యూ భూముల్లో పలువురు దళారులు ఇష్టానుసారంగా మట్టి తవ్వకాలను చేపడుతున్నారు.
అధికారులు మాత్రం తమకి ఏమి పట్టనట్లు వ్యవహారిస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి దళారులు అక్రమంగా గండి కొడుతున్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండటంపై ప్రజలు మండిపడుతున్నారు. మట్టిని తరలిస్తున్న అటవీ శాఖ అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడంతో వారి పాత్ర పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అటవీ భూముల్లో లెవెల్ ట్రా పెడితేనే అటవీశాఖ అధికారులు అక్కడికి వచ్చి అడ్డుకుంటారు అలాంటిది ఇప్పుడు ఏకంగా తవ్వకాలు జరిపి ఏకంగా కొండలు , గుట్టలు మింగేస్తున్నా పట్టించుకోవట్లేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి దళారుల దందాకు చెక్ పెట్టాలని స్థానికులు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Mannu who has not seen any eye

You cannot copy content of this page

Scroll to Top