Vadla Nandu : వికారాబాద్ నియోజకవర్గం బిజెపి పార్టీ కోఆర్డినేటర్ “వడ్ల నందు”

TRINETHRAM NEWS

Trinethram News : Vikarabad : దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపులో భాగంగా వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు మాధవ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు కొత్తగడి సమీపంలోని బంగారు మైసమ్మ ఆలయం ఆవరణలో బిజెపి నాయకులు స్వచ్ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఆలయం వద్ద పూజ కార్యక్రమాలు నిర్వహించే భక్తులు, వ్యర్థ పదార్థాలను అక్కడ ఏర్పాటు చేసిన చెత్తకుండీల వద్దనే వేయాలని ఆలయ ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు మాధవరెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ శ్రీధర్ రెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షులు నరోత్తం రెడ్డి, మండల అధ్యక్షులు గోపాల్ రెడ్డి,మోహన్ రెడ్డి, లెక్చరర్ జిన్నారం మోహన్ రెడ్డి ,విజయ కుమార్ ,మాజీ ఎంపీటీసీ శరణ రెడ్డి , బీజేపీ మండల ఉపాధ్యక్షులు నరేష్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top