Pradeep Kumar joins TDP : టీడీపీ లో చేరిన వెంటూరు వైసీపీ ఉప సర్పంచ్ ప్రధీప్ కుమార్

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ అక్టోబర్ 10. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాయవరం మండలం, వెంటూరు గ్రామ వైసీపీ ఉప సర్పంచ్ నున్న ప్రధీప్ కుమార్ శుక్రవారం మండపేట తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో వెంటూరు టీడీపీ గ్రామశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు , సమక్షంలో వైసీపీ ని వీడి టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ సంధర్బంగా ప్రధీప్ కుమార్ కు ఎమ్మెల్యే వేగుళ్ళ టీడీపీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

అనంతరం ఉప సర్పంచ్ ప్రధీప్ కుమార్ మాట్లాడుతూ కూటిమి ప్రభుత్వ విధివిధానాలు, చేపడుతున్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై టీడీపీ లో చేరినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో పార్టీ అభివృద్దికి కృషిచేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాయవరం మండల అధ్యక్షులు కొప్పిశెట్టి మాధవరావు, గ్రామశాఖ అధ్యక్షులు దేవళ్ళ వెంకట్రావు, రిమ్మలపూడి వేణుగోపాల దొర, మేడిశెట్టి రాంబాబు, దాయం శేఖర్, కోటి సత్యనారాయణ, తానింకి మణి, రవికుమార్, శ్రీను, వల్లూరి పెద్దబ్బు, తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

YCP Deputy Sarpanch Pradeep Kumar joins TDP...

You cannot copy content of this page

Scroll to Top