Vegulla Lilakrishna : ఉద్యమి సభ్యత్వనమోదు కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన వేగుళ్ల లిలకృష్ణ

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్, గంగాధర్ నెల్లూరు ఇంచార్జి. గంగాధర నెల్లూరు నియోజకవర్గం ,, కార్వేటి నగరం మండలం,, కార్వేటి నగరం మండల కేంద్రంలో … ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మరియు గంగాధర నెల్లూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ డాక్టర్ యుగంధర్ పొన్న ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన చిత్తూరు పార్లమెంటు సమన్వయకర్త వేగుళ్ల లీలా కృష్ణ తో ఆత్మీయ సమావేశం కార్యక్రమాన్నివిజయవంతంగా నిర్వహించడం జరిగింది .
ఈ సమావేశంలో పార్టీ బలోపేతం, గ్రామ స్థాయి నుండి నియోజకవర్గ , పార్లమెంటు స్థాయి వరకు సంస్థాగత నిర్మాణాన్ని మరింత దృఢంగా చేయడం, కొత్త సభ్యుల నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టడం వంటి అంశాలపై సమగ్రంగా చర్చించడంజరిగింది .
యువత, మహిళలు, రైతులు, కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగస్వాములు కావాలని లీలా కృష్ణ పిలుపునిచ్చారు.,,

ఈ కార్యక్రమంలో ఆరు మండలాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, నియోజకవర్గ కమిటీ సభ్యులు, జిల్లా ప్రాతినిధ్య వహిస్తున్న నాయకులు, వీర మహిళలు, జనసేన పార్టీ నాయకులు, పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Vegulla Lilakrishna, who was the chief guest

You cannot copy content of this page

Scroll to Top