దేవరకొండ డివిజన్ నవంబర్ 26 త్రినేత్రం న్యూస్. స్వాతంత్రం కోసం అమరులైన ఎంతోమంది త్యాగమూర్తులు బలైనారు ఇందులో దొడ్డి కొమరయ్య తనకున్న ఆస్తిని మొత్తం పేద ప్రజల కోసమే త్యాగం చేశాడు స్వాతంత్రం కోసం తెలంగాణలో తొలి అమరుడైన వ్యక్తి ఉన్నారు అంటే మొట్టమొదటి వ్యక్తి దొడ్డికొమరయ్య ఆ తరువాత నిజామాబాద్ జిల్లా ఉయ్యాలవాడ చెందిన వడ్డెర ఓబన్న రెండో వ్యక్తి ఆ తర్వాత ఎంతోమంది మహానుభావులు స్వాతంత్రం కోసం అమరులైనారు వారి త్యాగం మనం మరిచిపోలేని విషయం అందుకే ప్రతి సంవత్సరం
ఈ త్యాగం మూర్తులను స్మరించుకుంటూ కార్యక్రమాలు చేస్తున్నాము వడ్డెర కుల స్వాతంత్ర సమరయోధులు వడ్డెర ఓబన్న విగ్రహాన్ని దేవరకొండ పట్టణంలో మీనాక్షి చౌరస్తా బాలుర కళాశాల చాకలి ఐలమ్మ విగ్రహం ప్రక్కన విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నాము ఇందుకోసం దేవరకొండ మున్సిపాలిటీ కమిషనర్ ని కలిసి పర్మిషన్ తీసుకున్నాము మొదటిగా ఈనెల 30వ తేదీ నాడు చిన్నపాటి రౌండ్ దిమ్మె ఏర్పాటు చేయబోతున్నాము తదుపరి జనవరి 11వ తేదీ నాడు వడ్డెర ఓబన్న జయంతి కార్యక్రమం సందర్భంగా దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గం నుండి గ్రామ మండల అధ్యక్షులు కార్యదర్శులు ఉపాధ్యక్షులు కార్యవర్గ సభ్యులు పాల్గొంటారు నల్లగొండ జిల్లా నుండి జిల్లా నాయకులు జిల్లా అధ్యక్షులు పాల్గొంటారు.
జయంతి అయిపోయిన తర్వాత ఫిబ్రవరి నెలలో 10 11వ తేదీన పూర్తి విగ్రహాన్ని భారీ ఎత్తున ఏర్పాటు చేయబోతున్నాము ఆల్రెడీ వడ్డెర ఓబన్న విగ్రహం తయారవుతున్నది ఈనెల మాల్ దాటిన తర్వాత యాచారం దగ్గర విగ్రహం ఏర్పాటు కార్యక్రమం జరుగును కాబట్టి ఈనెల 29వ తేదీనాడు నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాల అధ్యక్షులు ఉదయం 11 గంటలకు దేవరకొండ ఇన్స్పెక్షన్ బంగ్లా ఐబి దగ్గరికి రావాలనీ వడ్డెర సంఘం దేవరకొండ నియోజకవర్గం అధ్యక్షులు ఇరగ దిండ్ల కృష్ణ ఒక ప్రకటనలో తెలియజేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


