WhatsApp Image 2024 02 27 at 08.24.36
Trinethram News : అమరావతి: కేంద్ర మంత్రి రాజ్ నాధ్ సింగ్ (Rajnath Singh) మంగళవారం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా విశాఖపట్నం (Visakha)లో వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు..
మధ్యాహ్నం ఢిల్లీ (Delhi) నుంచి ఆయన గన్నవరం విమానాశ్రయానికి వస్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి విజయవాడలోని ఒక ప్రైవేటు హోటల్‌లో జరగనున్న బీజేపీ కోర్ కమిటీ (BJP core committee) సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. పార్టీ ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేస్తారు. అనంతరం రాజ్‌నాథ్ సింగ్ ఏలూరు బయలుదేరి వెళతారు. ఏలూరు ఇండోర్ స్టేడియంలో బీజేపీ కార్యకర్తల సమ్మేళనంలో పాల్గొంటారు. అక్కడ కార్యక్రమాలు ముగించుకుని గన్నవరం విమానాశ్రయం చేరుకుని ఢిల్లీకి బయలుదేరి వెళతారు..
