
Trinethram News : శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవస్థానం, అనంతగిరి లో శ్రీ అనంత పద్మనాభ స్వామి వారిని ఈరోజు ఉదయం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. పూర్ణ కుంభ స్వాగతం పలికారు ఆలయ ధర్మకర్త యన్. పద్మనాభం, ఈఓ టీ.నరేందర్. వేద ఆశీర్వచనాలు చేసిన ఆలయ అర్చకులు. ఈ సందర్భంగా కేంద్రమంత్రికి స్వామి వారి ఫోటో బహూకరించారు. అదేవిధంగా ఆలయ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని కోరుతూ, దేవాలయం దగ్గర గల భూమి సమస్య గురుంచి వినతి పత్రం అందజేశారు. దీనికి సానుకూలంగా స్పందిస్తూ ఆలయ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేస్తామని, అలాగే పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి కేంద్రమంత్రి సుముఖంగా ఉన్నట్లు ఆలయ ఈవో తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపి కొండ విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎస్. రత్నం, జిల్లా బిజెపి అధ్యక్షులు సదానంద రెడ్డి, నాయకులు తదితరులు స్వామి వారిని దర్శించుకున్నారు.
