TRINETHRAM NEWS

Trinethram News : Telangana : ఈ రోజు ఉదయము 9.00 గంటలకు బోయినపల్లి లోని సాయి మోడల్ హై స్కూల్ లో ది ఆదర్శ్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు లిమిటెడ్, బోయినపల్లి శాఖ ఆధ్వర్యంలో స్కూల్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ సేవింగ్ బ్యాంకు ఖాతా కిడ్డి బ్యాంక్ ద్వారా దాని యొక్క ప్రాముఖ్యత గురించి సహాయ మేనేజర్ పి.వెంకటేశము మాట్లాడుతూ విద్యార్థులకు ఇప్పటి నుంచే బంధువులు, మిత్రులు పండుగలకు,ఫంక్షన్లకు ఇచ్చే డబ్బును వృధాగా ఖర్చు చేయకుండ బ్యాంకు లో దాచుకోవాలని, చిన్న మొత్తల పొదుపుతో పెద్ద మొత్తములో ఏర్పడి భవిష్యత్తులో ఉపయోగపడుతుంది.. చిన్న నీటి బందువు సముద్రములో ఒక భాగమే. వాళ్ళు పెద్ద అయిన తర్వాత డబ్బు ఎలా ఉపయోగించవలేనని తెలియజేస్తుంది. దానివలన జీవితము బాగుపడుతుంది అని వివరించడము జరిగినది.
విద్యార్థుల నుంచి మంచి స్పందన వచ్చినది. దాదాపుగా 100 విద్యార్థులు పాల్గొన్నారు.
స్కూల్ యాజమాన్యం కూడా విద్యార్థులకు వివరించినారు.
ఇట్టి కార్యక్రమం లో బ్యాంకు శాఖ మేనేజర్ కె. బ్రహ్మానందం,
, ఐ. శ్రావణి స్కూల్
ప్రిన్సిపాల్ డి. విజయ మరియు రమేష్ పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App