జూన్ 30, 2026

WhatsApp Image 2023 12 17 at 4.38.55 PM

TRINETHRAM NEWS

Encounter : మావోయిస్టుల కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి మరో ఇద్దరికి గాయాలు..

బీజాపూర్, సుక్మా జిల్లాల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు జవాన్లు మృతి చెందారు. బీజాపూర్, సుక్మా జిల్లాల్లో మావోయిస్టులే టార్గెట్ గా జవాన్లు కూంబింగ్ నిర్వహించారు..

ఈ క్రమంలో జవాన్లను టార్గెట్ చేసుకుని మావోయిస్టులు ఎదురు కాల్పులు జరిపారు. బీజాపూర్, సుక్మా రెండు జిల్లాలో మావోయిస్టుల కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి చెందగా, మరో ఇద్దకి తీవ్ర గాయాలు అయ్యాయి..

బీజాపూర్ లో మావోయిస్టుల దాడిలో ఒక సీఆర్పీఎఫ్ జవాను మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. సుక్మా జిల్లాలోని బెద్రే శిబిరంలో మావోయిస్టుల దాడిలో సీఆర్పీఎఫ్ కు చెందిన ఏఎస్ఐ మృతి చెందారు. మావోల దాడిలో గాయపడిన మరో జవాన్ కు తీవ్ర గాయాలు అయ్యాయి..

జవాన్లు వారంతపు సంతకు వచ్చిన సమయంలో మావోయిస్టులు కాల్పులు జరిపారు. జాగర్గుండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన చోటు చేసుకుంది. మావోయిస్టులు ఐఈడీలు ఏర్పాటు చేశారు. వరుసగా ప్రతీకార చర్యలు కొనసాగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర బలగాలు మావోయిస్టుల కోసం అడవిని జల్లెడ పడుతున్నాయి..

You cannot copy content of this page