ఆగస్ట్ 15, 2026
TRINETHRAM NEWS
Two Arrested

Two Arrested : డుంబ్రిగూడ,ఆగస్టు 12, (త్రినేత్రంన్యూస్): అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడ మండలం కిల్లోగూడ జంక్షన్‌ వద్ద 14 కేజీల గంజాయిని తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. హోండా యాక్టివా స్కూటీపై గోనే సంచిలో గంజాయిని తరలిస్తుండగా డుంబ్రిగూడ ఎస్‌ఐ ఎల్‌. సురేష్‌ తన సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. అరెస్టయిన వారిలో విశాఖపట్నం వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని జాలారిపేటకు చెందిన వాసుపల్లి పృద్వి ఉండగా, మరో వ్యక్తి విజయనగరం జిల్లా ధర్మవరం, ఎస్‌.కోట ప్రాంతానికి చెందిన జువెనైల్‌గా పోలీసులు గుర్తించారు.
వాసుపల్లి పృద్విపై గతంలోనూ వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గంజాయి కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గతంలో విశాఖపట్నం సెంట్రల్‌ జైలులో ఉన్న సమయంలో ఒడిశాకు చెందిన ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడిందని, జైలు నుంచి విడుదలైన అనంతరం అతని వద్ద నుంచి గంజాయిని తీసుకుని విశాఖపట్నానికి తరలిస్తున్నట్లు విచారణలో వెల్లడైనట్లు పేర్కొన్నారు.
విశాఖపట్నం వన్‌టౌన్‌ పరిధిలోని హార్బర్‌, పోర్టు ప్రాంతాల్లో గంజాయిని చిన్న చిన్న పొట్లాలుగా చేసి విక్రయించడం ద్వారా అధిక మొత్తంలో డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో గంజాయిని తరలిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం.
ఈ కేసులో గంజాయిని సరఫరా చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పాడువా లెంజిగూడ గ్రామానికి చెందిన పాంగి హరిని కూడా పోలీసులు ఆగస్టు 11 మంగళవారం నాడు అరెస్టు చేశారు. గంజాయి అక్రమ రవాణా కేసులో అరెస్టయిన ఇద్దరు నిందితులను రిమాండ్‌ నిమిత్తం విశాఖపట్నం సెంట్రల్‌ జైలుకు తరలించగా, జువెనైల్‌ను చిల్డ్రన్‌ హోమ్‌కు పంపినట్లు పోలీసులు తెలిపారు. కేసుపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page