కామారెడ్డి బిక్కనూర్ కేసులో ట్విస్ట్

TRINETHRAM NEWS

కామారెడ్డి బిక్కనూర్ కేసులో ట్విస్ట్

Trinethram News : కామారెడ్డి : కామారెడ్డి జిల్లాలో కలకలం సృష్టించిన భిక్కనూరు ఎస్‌ఐ సాయికుమార్, బీబీ పేట కానిస్టేబుల్‌ శ్రుతి, కంప్యూటర్‌ ఆపరేటర్‌ నిఖిల్‌ మృతి ఘటన ఎట్టకేలకు మిస్టరీ వీడింది.

అడ్లూర్‌ యల్లారెడ్డి చెరువులో మునిగి ముగ్గురు మృతి చెందినట్లు ప్రాథమిక పోస్టుమార్టం నివేదికలు వెల్లడిస్తున్నాయి. నీటిలో ఊపిరాడక మృతి చెందినట్లు వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించినట్లు పోలీసులు తెలిపారు. ముగ్గురి మృతదేహాలపై ఎలాంటి గాయాలు లేవని నివేదికలు వెల్లడించినట్లు సమాచారం.

మొదటగా ఆత్మహత్య చేసుకోవడానికి శృతి చెరువులో దూకింది. శృతి తర్వాత దూకిన నిఖిల్, ఈత రాకపోవడంతో నిఖిల్ గల్లంతు. శృతి కాపాడమని అడగడంతో ఎస్సై సాయి కుమార్ చెరువులోకి దూకాడు. చెరువు పెద్దది కావడం తో సాయి కుమార్ నీట మునిగారు. ముగ్గురికి ఈత రాకపోవడంతో ఊపిరి ఆడక ముగ్గురు మృతి. కానిస్టేబుల్ శృతిని కాపాడే ప్రయత్నంలో ఎస్సై సాయికుమార్‌, ఆపరేటర్‌ నిఖిల్‌ ఇద్దరు చెరువులోకి దూకినట్లు పోలీసులు గుర్తించారు. భిక్కనూరు పోలీస్ స్టేషన్ నుంచి అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు వరకు రహదారి పొడవునా ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను సేకరించారు. 25వ తేదీ (బుధవారం) మధ్యాహ్నం 1.26 గంటలకు ముగ్గురి సెల్ ఫోన్లు స్విచ్ఛాఫ్ అయినట్లు నిర్ధారణ అయింది. ముగ్గురూ ఒకేసారి నీటిలో మునిగిపోయి ఉంటారని భావిస్తున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top