ఆగస్ట్ 6, 2026

WhatsApp Image 2024 01 18 at 3.56.53 PM

TRINETHRAM NEWS

ఘనంగా నందమూరి తారక రామారావు వర్ధంతి నివాళులు

తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెం గ్రామంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి నివాళులను ఎన్టీఆర్ సెంటర్ నందు పార్టీ నాయకులు కార్యకర్తల నడుమ తెదేపా జండాను ఆవిష్కరించి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు

గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బొల్లిన విజయభాస్కర్ మాట్లాడుతూ తెలుగుజాతికి వన్నె తెచ్చి జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహోన్నత వ్యక్తి నవరస నటనా సార్వభౌమూడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు మార్గదర్శకులని అన్నారు తదుపరి సంతమార్కెట్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు

కార్యక్రమంలో సీనియర్ పార్టీ నాయకులు కారుమంచి స్వామీజీ మండా రామచంద్రరావు యువ నాయకులు పెన్మత్స సుబ్బరాజు మండా సుబ్బారావు పాలపాటి గిరి మహేంద్ర మహాలక్ష్మి నాగరాజు నాగు పెద్దిలయ్య వెంకటేశ్వరరావు దుర్గారావు రాంపండు తదితరులు పాల్గొన్నారు

You cannot copy content of this page