కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మార్చి 15 : ఈ రోజు ఫతేనగర్ డివిజన్ పరిదిలోని భరత్‌నగర్ కాలనీ, జెపినగర్ ఎస్పీ నగర్ సంక్షేమ సంఘ కమిటీ సభ్యులు, జలమండలి అధికారులు డీజీఎం శివ, మేనేజర్ జెక్కి తో సంయుక్తంగా కార్పొరేటర్ పడాల సతీష్ గౌడ్ మంచినీటి సమస్య పై కాలనీ వాసులతో కలిసి సమావేశం నిర్వహించడం జరిగింది, ఈ సమావేశంలో కాలనీవాసులు కాలనీలో మంచినీరు ప్రెషర్ తక్కువ గా వస్తున్నందున వేసవికాలం కావడంతో బాగా నీటి ఇబ్బంది అవుతుందని కార్పొరేటర్ దృష్టికి తీసుకురావడం జరిగింది.
కార్పొరేటర్ వెంటనే అక్కడ ఉన్న అధికారులతో మాట్లాడుతూ తక్షణమే మన డివిజన్ కి రావలసిన నీళ్లు సక్రమంగా వస్తున్నాయా లేదా రాకపోతే పై అధికారులతో చర్చించి మనకు నీరు వచ్చేలాగా చర్యలు తీసుకుంటామని ఖచ్చితంగా ప్రజలకు వేసవిలో కూడా గతంలోలా ఎలాంటి అవాంతరాలు లేకుండా మంచినీరు సరఫరా చేసే బాధ్యత అధికారులపై ఉంది కాబట్టి మీరు కచ్చితంగా దానికి అనుగుణంగా ప్రణాళికలు వేసుకోవాలని ఆదేశించడం జరిగింది.
అదే విధంగా జెపి నగర్ కాలనీలో 20 ఫీట్ల వరకు మూడు 900 డయావేస్తే మంచి నీటి సమస్య పోతుందని కాలనీవాసులు తెలపడం జరిగింది. ఆ యొక్క పైప్ లైన్లు కూడా రెండు మూడు రోజులలో వేయాలని అధికారులకు సూచించడం జరిగింది. అనతరం సమస్యను శాశ్వతంగా పరిష్కరించమని డీజీఎం శివకి , మేనేజర్ జెక్కి కి కార్పొరేటర్ చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమం లో జెపి నగర్ ఎస్పి నగర్ సంక్షేమ సంఘం ప్రతినిధులు మరియు కాలనీవాసులు పాల్గొనడం జరిగింది,
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


