అల్లూరిజిల్లా అరకులోయ నవంబర్ 13, (త్రినేత్రం న్యూస్): ఆదివాసీ పోరాటయోధుడు , స్వాతంత్ర్య సమరయోధుడు బిర్సా ముండా 150 వ జయంతి వారోత్సవాలు నవంబర్ 15 తేదీన జయప్రదం చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో అరకువేలి దండకారణ్య కళాశాలలో బిర్సాముండా చిత్రపట్టాన్ని నివాళులర్పించిన అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ పొట్టంగి రాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ మాట్లాడుతూ బిర్సా ముండా 19వ శతాబ్దపు జార్ఖండ్ రాష్ట్రంలో బ్రిటిష్, స్వదేశీ భూస్వాములచే బానిసలుగా ఉన్న ఆదివాసీ ప్రజల కోసం పోరాడారని భారతీయ భూస్వాములను ఆధిపత్య కులాలను అత్యంత ధైర్య సాహస ధీరత్వంతో ఎదిరించి గిరిజనుల సంస్కృతిని గిరిజనుల ఆత్మగౌరవాన్ని కాపాడిన వీరుడని బిర్సాముండా. జల్, జంగిల్, జమిన్ (నీరు, అడవి, భూమి) ఆదివాసీలా హక్కు, తమ ప్రాంతం లో స్వయం పాలన కావాలని గొప్ప ఆశయం కోసం చిన్న వయసులోనే తన జీవితాన్ని త్యాగం చేసారని
‘ఆదివాసీల ఆత్మగౌరవ దినోత్సవం’గా కేంద్రప్రభుత్వం ఆయన జయంతిని నిర్వహిస్తూ మరోవైపు ఆదివాసీల అటవీ సంపద భూములను కార్పొరేట్ నవయుగ, అదానీలకు హైడ్రో పవర్ ప్రాజెక్ట్ లకు కట్టబెట్టారని ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ లో 10 వేల ఎకరాల అటవీ భూమిని హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం కేటాయించారు. అదానికి కేటాయించిన అటవీ ప్రాంతాల్లో ఆరు లక్షల చెట్లు తొలగింపుతో పాటు ఒరిస్సా రాష్ట్రంలో డబులు ఇంజెన్ ప్రభుత్వం 7679 హెక్టర్ లా అటవీ భూమిని కార్పొరేట్ కంపెనీ ఇచ్చారని రాష్ట్ర కూటమి ప్రభుత్వం పాడేరు ఏజెన్సీలో హైడ్రో ప్రాజెక్టు పేరిట అదానీ, నవయుగ కార్పొరేట్ కంపెనీలకు వేలాది ఎకరాల ఆదివాసీల భములను కట్టబెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకున్నాయని జీఓలు 2,13,51 జారీచేశారని జల్, జంగిల్, జమిన్ (నీరు, అడవి, భూమి) కాపాడటమే బిర్సా ముండా కు ఇచ్చే నిజమైన ఘన నివాళి అంతేకాని బిర్సా ముండా దినోత్సవం పేరుతొ ఓటుబ్యాంక్ రాజకీయం కోసం గిరిజనుల అస్థిత్వాన్ని దెబ్బ తీయడం కాదని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం మండల నాయకులు మాజీ ఎంపీటీసి బురిడీ దశరథ్ పెసా కమిటీ కార్యదర్శి కిల్లో రామన్న దండకారణ్య కళాశాల అధ్యాపకులు ప్రసాద్ దామోదర్ కృష రాజేంద్ర హీరాలాల్ కలిమా థిఅప్పలనాయుడు అంకిత కావ్యా నందిని వివేక్ సీతారాం తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


