Araku MLA : అసెంబ్లీలో గిరిజనుల సమస్యలపై గొంతు వినిపించాలని అరకు ఎమ్మెల్యేకి వినతిపత్రం అందజేసిన గిరిజన నాయకులు సురేంద్ర,బాల్దేవ్

TRINETHRAM NEWS

అల్లూరిజిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ ఫిబ్రవరి 21: ఈ నెల 24 నుండి జరగనున్న అసెంబ్లీ సమావేశంలో షెడ్యూల్ ఏరియాలో వందశాతం ఉద్యోగ ,ఉపాధ్యాయ నియామక చట్టం చేయాలని, ఏజెన్సీ స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని అసెంబ్లీ సమావేశంలో ప్రభుత్వంపై ఒత్తిడి చెయ్యాలని అరకువేలి ఎమ్మెల్యే మత్యాలింగం కి ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర ఆదివాసి గిరిజన సంఘం అల్లూరి జిల్లా ప్రధాన కార్యదర్శి పి.బాలదేవ్ ఆధ్వర్యంలో అరకువేలి.లో విన్నతి పత్రం ఇవ్వడమైనది ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లోసురేంద్ర అల్లూరి జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ మాట్లాడుతూ ఈనెల 24 నుండి జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో షెడ్యూల్ ప్రాంతంలో వంద శాతం ఉద్యోగ ,ఉపాద్యాయ నియామక చట్టం ప్రభుత్వం బడ్జెట్ సమావేశంలో ఆమోదించి ఏజెన్సీ స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
జివో నంబర్ 3 చట్టబద్ధత ఏజెన్సీ స్పెషల్ డీఎస్సీపై రాష్ట్ర ముఖ్యమంత్రి అరకు ఎన్నికల సభలో ఇచ్చిన హామీప్రకరం రానున్న అసెంబ్లీ సమావేశంలో ఏజెన్సీ ప్రాంతంలో వందశాతం ఉద్యోగ,నియామక చట్టం చెయ్యాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు గడిచిన గిరిజన సలహా మండలి నియమించలేదని తక్షణమే గిరిజన సలహా మండలి ఏర్పాటు చెయ్యాలని డిమాండ్ చేశారు, 1/70 చట్టం అమలుపై రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ సమావేశంలో చర్చించాలని డిమాండ్ చేశారు.

రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఏజెన్సీ ప్రాంతంలో వందశాతం ఉద్యోగ, ఉపాధ్యాయ నియమకచట్టం, ఏజెన్సీ స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల పై ఏజెన్సీ ప్రాంత ఎమ్మెల్యేలందరూ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలో ప్రభుత్వంపై ఒత్తిడి చెయ్యాలని విజ్ఞప్తి చేశారు, 1/70 చట్టం అమలుపై రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ సమావేశంలో చర్శించేవిధంగా ఏజన్సీ ప్రాంతంలోని (ఏమ్ ఎల్ ఏ)లందరూ ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర కమిటి పిలుపిస్తుంది. ఆదివాసి గిరిజన సంఘం ఆధ్యర్యంలో ఏజేన్సీ ప్రాంత 7 గురు ఎమ్మెల్యే లందరిని అసెంబ్లీలో చర్చించేవిధంగా వొత్తిడి చెయ్యాలని మెమేరండాలు ఇవ్వడం జరుగుతున్నది.
ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం మండల అధ్యక్షులు జి. చిన్నబాబు,ఉపాధ్యక్షులు కె.జగన్నాధం,కె.మగ్గన్న పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Araku MLA

You cannot copy content of this page

Scroll to Top