త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన మహానీయుడు కొమరం భీమ్ వర్ధంతి సందర్భంగా కొమ్ముగూడెం గ్రామంలో ములకలపల్లి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కొడమే వంశీ ఆధ్వర్యంలో కొమరం భీమ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జల్ జంగల్ జమీన్ నినాదంతో నిజాం పాలకులకు వ్యతిరేకంగా పోరాడి ఆదివాసీల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారని గుర్తు చేశారు. ఆయన పోరాటం అణగారిన వర్గాల స్వయంపాలన స్వాభిమానం కోసం సాగిన చరిత్రాత్మక ఉద్యమన్ని ఆయన చూపిన ధైర్యం త్యాగం నేటికీ తరానికి స్ఫూర్తి అన్నారు.
కొమరం భీమ్ వర్ధంతి కేవలం సంస్మరణ దినం కాకుండా గిరిజనుల హక్కుల పరిరక్షణకు పునరంకితం కావాల్సిన రోజుగా నిలపాలని ఆయన పిలుపునిచ్చారు. కొమరం భీమ్ ఆశయాల సాధనలో భాగంగా ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధి కోసం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి జిల్లా నాయకులు సోడే శ్రీనివాస్, ములకలపల్లి మండలం సోషల్ మీడియా కోఆర్డినేటర్స్ కొడిమే తేజ, సోయం వేదవ్యాస్, సోయం రతన్, సోయం రామకృష్ణ, తాటి వెంకటేష్, సడియం విజయ్, కొడిమే రాములు, కాక ముత్యాలరావు, కారం చరణ్ తదితరులు నివాళులర్పించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


