త్రినేత్రం న్యూస్ భద్రాచలం : భారతదేశంలో నివసిస్తున్న, గిరిజనుల యొక్క, సంస్కృతి సాంప్రదాయాలు భిన్నత్వంలో ఏకత్వం. లాగా పాత తరం గిరిజనులు సంస్కృతి, సాంప్రదాయాలు, కట్టుబాట్లు, అంతరించిపోకుండా కాపాడుకుంటు, వచ్చారో నేటితరం గిరిజన యువతి యువకులు ఆచార వ్యవహారాలు, వారి మాతృభాషను రాబోయే తరానికి అందించడానికి కృషి చేయాలని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు.
ఆదివారం నాడు ఐటిడిఏ సమావేశం మందిరంలో, ప్రపంచ ప్రదర్శనశాల దినోత్సవం మరియు కోయ వీర గాధ చక్రం ప్రదర్శన, డాక్యుమెంటేషన్, ప్రారంభ సభలో ఆయన ముఖ్యఅతిథిగా, పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసి గూడెం ల లో గిరిజనులపై జరుగుతున్న అన్యాయాలను మొక్కవోని ధైర్యంతో పెత్తం దారులను ఎదిరింఛిన సమ్మక్క, సారలమ్మలు అలాగే కాకతీయులను ఎదిరించి వీరమరణం పొందిన ఆదివాసుల ఇలవేల్పులు, బాపనమ్మ, చంద్రపాల వారసులు, రుద్రమదేవి పరిపాలన కాలంలో వాడుకున్న ఆయుధం, వారి యొక్క చరిత్రను వీరగాథలుగా మలిచి నేటితరం గిరిజనానికి తెలియపరచడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.
గిరిజన సాంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు ప్రాచుర్యంలోకి రావడానికి మా వంతు కృషి చేస్తామని, ప్రస్తుతం ఐటిడిఏ అధికారిగా బాధ్యతలు తీసుకొని పది నెలలు గడుస్తున్నాయని ముందుగా గిరిజన విద్యా వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించానని అలాగే నేటితరం గిరిజన యువతి యువకులకు పిల్లలకు భాష పట్ల సరిగా అవగాహన లేకపోవడంతో వారి భాష పై వారికి మక్కువ కలిగేలా ప్రయత్నించానని, ఆదివాసి కళలు మరియు ఆచార వ్యవహారాలు అంతరించిపోకుండా ఖండాంతరాలకు తెలిసే విధంగా గిరిజన మ్యూజియం పై ప్రత్యేక దృష్టి సారించామని, పాత తరం గిరిజనుల జీవనశైలి వ్యవసాయం వారు వాడిన పనిముట్లు పాతతరం ఇండ్లు వారు ఇలవేల్పులు పూజా విధానం నగలు గృహోపకరణాలు ఆదరణకు నోచుకోకపోవడంతో వాటిని సేకరించి మ్యూజియంలో పొందుపరచడం జరిగిందని మేము అనుకున్న దానికంటే మ్యూజియంకు టూరిస్టుల సంఖ్య ప్రతిరోజు పెరుగుతున్నదని, గిరిజనుల యొక్క కట్టుబాట్లు ఏ విధంగా ఉన్నాయో అన్ని మ్యూజియంలో పొందుపరిచామని అన్నారు.
గిరిజన సంస్కృతి వారి యొక్క కట్టుబాట్లు, భాష యొక్క ప్రామాణికతను పెంపొందించుకోవడానికి ఒక ప్రాజెక్టు లాగా రూపొందించి రాబోయే తరానికి తెలిసే విధంగా ఐటీడీఏ తరఫున కృషి చేస్తానని అన్నారు. అనంతరం కోయ సంస్కృతి సాంప్రదాయాలకు చెందిన బుక్ లేట్ ను ఆవిష్కరించి, కులపతులను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో గిరిజన కల్చర్ రిసర్చ్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ తిరుమల్ రావు, తలపతులు బండ్ల మునీశ్వరరావు, గొర్రె బాపనయ్య, బండ్ల చుక్కమ్మ, గొర్రె సత్యం, రాంబాబు ట్రైబల్ మ్యూజియం ఇంచార్జ్ వీరాస్వామి మరియు వివిధ గ్రామాల నుండి వచ్చిన గిరిజనులు తదితరులు పాల్గొన్నారు. అదనపు పౌర సంబంధాల అధికారి కార్యాలయము భద్రాచలం నుండి జారీ చేయడమైనది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


