Tree Plantation : ఎన్.ఎస్.ఎస్ .విద్యార్థులచే ట్రీ ప్లాంటేషన్

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ :డిసెంబర్ 15: నెల్లూరు జిల్లా :బోగోలు మండలం.. బోగోలు మండలం కడనూతల గ్రామంలో గల రామిరెడ్డి సుబ్బరామిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ఎన్.ఎస్.ఎస్ .విద్యార్థిని విద్యార్థులు స్పెషల్ క్యాంపులో భాగంగా ఆరవ రోజు కొండ బిట్రగుంట దేవాలయం ప్రాంతంలో, పాఠశాల ప్రాంతంలో, రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టినట్టు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పివిఎన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొక్కల పెంపకం వల్ల గాలి శుద్ధి, పర్యావరణ సమతుల్యత, మానసిక ఆరోగ్యం మెరుగుపడటం, నేల కోత నివారణ, వన్యప్రాణులకు ఆవాసం వంటి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయనీ; ఇవి మనకు ఆక్సిజన్ అందించి, ఒత్తిడిని తగ్గించి, జీవవైవిధ్యాన్ని ప్రోత్సహించి, ఆరోగ్యకరమైన జీవితానికి దోహదపడతాయనీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్.ఎస్.ఎస్ .సమన్వయకర్త ఏ కిరణ్ కుమార్, గ్రామస్తులు, ఎన్.ఎస్.ఎస్. విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Tree plantation by NSS students

You cannot copy content of this page

Scroll to Top