Training on Nutrition Tracker : ఐసిడిఎస్ ఆధ్వర్యంలో డిండి సెక్టార్ లో టీచర్లకు పోషణ ట్రాకర్ పై శిక్షణ

TRINETHRAM NEWS

డిండి (గుండ్ల పల్లి) జులై 15.త్రినేత్రం న్యూస్. ఐసిడిఎస్ ప్రాజెక్ట్ దేవరకొండ పరిధిలోని దిండి సెక్టార్ లో అంగన్వాడీ టీచర్లకు మంగళవారం గోనకోల్ గ్రామంలో పోషణ ట్రాకర్, ఫోటో క్యాప్చర్, ఈ కేవైసీ లపై అవగాహన తరగతులను నిర్వహించారు. గర్భిణీ, బాలింతలు ,పిల్లలకు ఫోటో క్యాప్చర్ చేసి ప్రత్యక్షంగా చూపించడం జరిగినది. పోషణ ట్రాకర్ యాప్ లో ఫోటో క్యాప్చర్ అయినా లబ్ధిదారులకు ఫుడ్ ఇవ్వబడుతుందని సూపర్వైజర్ రేణుకా రెడ్డి తెలిపారు.

ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ సతీష్, ప్రాజెక్టు కోఆర్డినేటర్ అంతయ్య, డిండి సెక్టార్ అంగన్వాడీ టీచర్స్, తల్లిదండ్రులు ,చిన్నారి బాలబాలికలు పాల్గొన్నారు ఇదే సందర్భములో గోనకల్ అంగన్వాడి సెంటర్లో 1985 నుండి ఆయాగా పనిచేసి సేవలందించిన బుచ్చమ్మ రిటైర్ అయిన సందర్భాన్ని పురస్కరించుకొని ఆమెను ఘనంగా సన్మానించినారు. సూపర్వైజర్ రేణుక మాట్లాడుతూ బుచ్చమ్మ సేవలను కొనియాడారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Training on nutrition tracker

You cannot copy content of this page

Scroll to Top