WhatsApp Image 2025 01 19 at 18.37.54
హమాలీ కార్మికులకు ట్రాఫిక్ అవగాహన సదస్సు
రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత
హెల్మెట్ తప్పనిసరిగా వాడాలి
ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్
పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా
పెద్దపల్లి ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో పెద్దపల్లి హమాలీ కార్మిక సంఘం భవనం, రైల్వే స్టేషన్ ఆవరణ లో ట్రాఫిక్ రూల్స్, రాష్ డ్రైవింగ్, త్రీబుల్ రైడింగ్, హెల్మెట్, సీట్ బెల్ట్, వాహన ధ్రువీకరణ పత్రాల ఉపయోగం పై అవగాహనా కల్పించారు.
ఈ కార్యక్రమంలో సీఐ మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి. వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి అదేవిధంగా తమ వెహికల్ కి ఇన్సూరెన్స్ తీసుకొని ఉండాలి. మద్యం సేవించి వాహనాలు నడపరాదు మరియు అతివేగంగా అజాగ్రత్తగా సెల్ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపరాదు. వాహనాలు నడిపినప్పుడు అందరూ సీట్ బెల్ట్ ధరించి ఉండాలి. ప్రతి ఒక్కరూ కుటుంబం పట్ల సమాజం పట్ల బాధ్యతగా ఉండి డ్రైవింగ్ చేయాలి తద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించాలి. అలాగే ఎవరైనా రోడ్డు ప్రమాదాల బారిన పడితే వారి సమాచారం పోలీసు వారికి మరియు 108 కి అందించి, ఇంకా వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించడంలో సహాయపడాలి. మన నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల కొన్ని కుటుంబాలు చిన్నాభిన్నం అవుతాయి అని తెలిపారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
