త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. ములకలపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకల కార్యక్రమంలో అశ్వారావుపేట నియోజకవర్గ గౌరవ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు..
ఈ సందర్భంగా స్వర్గీయ జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ చిన్నారుల హక్కులను కాపాడటానికి, వారికి ఉజ్వల భవిష్యత్తును అందించడానికి మనవంతు కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా చిన్నారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థులకు మెరుగైన వసతులు, నాణ్యమైన విద్య అందేలా కాంగ్రెస్ ప్రభుత్వం తరపున అన్ని విధాలా సహకారం అందిస్తామని, పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
అదేవిధంగా విద్యార్థులకు మెరుగైన భవిష్యత్తు కోసం నిరంతరం కృషి చేస్తామని విద్యాభివృద్ధికి నేను సైతం చేయూత కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు అవసరమైన విద్యా సామాగ్రి ఉచితంగా అందిచాలని సామాజిక సేవ పట్ల ఆసక్తి ఉన్న వారి ద్వారా పలు పాఠశాలల విద్యార్థులకు ఇప్పటికే విద్యాసామాగ్రిని అందజేశాం అని తెలియజేసారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మాజీ సర్పంచ్ కారం సుధీర్ కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు సురభి రాజేష్ మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు …
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


