నేడు ఇరిగేషన్ శాఖ పై రేవంత్ రెడ్డి సమీక్ష.. విజిలెన్స్ దాడులపై చర్చ..!
Trinethram News : హైదరాబాద్
నేడు ఇరిగేషన్ శాఖ పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. ఇరిగేషన్ శాఖ పై విజిలెన్స్ దాడులు పై చర్చించనున్నారు. కాళేశ్వరం నిర్మాణంపై న్యాయ విచారణ, పెండింగ్ పనులపై చర్చ జరగనుందని సమాచారం..
ఈ సమీక్షలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. కాగా.. తాజాగా మేడిగడ్డ బ్యారేజీ కుప్పకూలిన ఘటనపై విజిలెన్స్ విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఈనెల 9వ తేదీన కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని పలు ఇరిగేషన్ కార్యాలయాల్లో విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. జలసౌధలోని తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యాలయానికి విజిలెన్స్ అధికారులు వెళ్లి తనిఖీలు చేపట్టారు. ఈఎన్సీ మురళీధర్ రావు కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు సోదాలు చేశారు. కార్యాలయంలోని రెండు, నాలుగో అంతస్తుల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు..