Trinethram News : చరిత్రలో ఈరోజు నవంబర్ 08…
Trinethram News : సంఘటనలు
1947: జూనాగఢ్ సంస్థానం భారత్‌లో విలీనమయ్యింది.
1948: మహత్మా గాంధీని హత్య చేసినట్లుగా నాథూరాం గాడ్సే అంగీకరించాడు, కాని కుట్ర చేసినట్లుగా ఒప్పుకోలేదు.
2016: రు.500, రు.1000 నోట్లను భారత ప్రభుత్వం రద్దు చేసింది.
జననాలు
1656: ఎడ్మండ్ హేలీ, హేలీ తోకచుక్క ను కనుగొన్న హేలీ ఇంగ్లండు లో హేగర్‌స్టన్ లో ఒక ధనిక కుటుంబంలో జన్మించాడు. (మ.1742)
1908: రాజారావు, ప్రముఖ ఆంగ్ల నవలా, కథా రచయిత. పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత (మ.2006).
1927: లాల్ కృష్ణ అద్వానీ, భారతీయ జనతా పార్టీ నాయకుడు.
1969: ఎనుముల రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రస్తుత ముఖ్యమంత్రి.
మరణాలు
1971: పూతలపట్టు శ్రీరాములురెడ్డి, ప్రముఖ తెలుగు కవి, అనువాదకులు (జ.1892).
1977: బి.ఎన్.రెడ్డి, తెలుగు సినిమా దర్శకుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన తొలి దక్షిణ భారతీయుడు (జ.1908).
2013: ఎ.వి.ఎస్ గా పేరు గాంచిన ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం. తెలుగు సినిమా హాస్యనటుడు, రచయిత, దర్శకుడు, నిర్మాత మరియు రాజకీయనాయకుడు (జ.1957).
జాతీయ దినాలు
అంతర్జాతీయ రేడియాలజి దినం.