TRINETHRAM NEWS

సంఘటనలు

1991: విశాఖపట్నంలో సాంస్కృతిక కార్యక్రమాలకు, సంప్రదాయ కళలకు కాణాచి అయిన్ కళాభారతి వ్యవస్థాపక దినోత్సవము. కళాభారతి ఆడిటోరియము 1991 మే 11 లో, విశాఖపట్నంలోని పిఠాపురం కాలనీలో ప్రారంభించారు.

2008: రష్యా అధ్యక్ష ఎన్నికలలో మాజీ అధ్యక్షుడు పుతిన్ బలపర్చిన అభ్యర్థి దిమిత్రి మెద్వెదేవ్ విజయం.

2009: పాకిస్తాన్లో లాహోర్ లోని గఢాఫి స్టేడియం సమీపంలో శ్రీలంక క్రికెట్ క్రీడాకారులపై తీవ్రవాదులు కాల్పులు జరిపారు.

1938: సౌదీ అరేబియాలో పెట్రోల్ గుర్తింపు.

1939: బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మహాత్మా గాంధీ ముంబైలో నిరాహార దీక్ష.

🇮🇳జాతీయ/అంతర్జాతీయ దినాలు🇮🇳

ప్రపంచ వినికిడి దినోత్సవం

ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం

జాతీయ రక్షణ దినోత్సవం

జననాలు

1839: జంషెడ్జీ టాటా, టాటా గ్రూప్ వ్యవస్థాపకులు.

1847: అలెగ్జాండర్ గ్రహంబెల్, టెలీఫోనును కనిపెట్టిన శాస్త్రవేత్త. (మ.1922)

1880: ఆచంట లక్ష్మీపతి, ఆయుర్వేద వైద్యుడు, సంఘసేవకుడు. (మ.1962)

1891: కొంగర సీతారామయ్య, రంగస్థల నటుడు, కవులకు, గాయకులకు, పండితులకు, మిత్రులకు ఎనలేని దానాలు చేశాడు. (మ.1978)

1895: రాగ్నర్ ఫ్రిష్, ఆర్థికవేత్త . (మ.1973)

1937: సత్యం శంకరమంచి, పాఠకుణ్ణి ఏకబిగిగా చదివించే గుణం సత్యం కథలలో ఉంది. అమరావతి కథలు గ్రంథానికి 1979లో రాష్ట్ర సాహిత్య అకాడమీ పొందారు.

1939: ఎం.ఎల్.జయసింహ, హైదరాబాదుకు చెందిన భారతీయ క్రికెట్ క్రీడాకారుడు.

1955: జస్పాల్ భట్టి, హాస్య, వ్యంగ్య టెలివిజన్ కళాకారుడు. (మ.2012)

1967: శంకర్ మహదేవన్, భారతీయ గాయకుడు, స్వరకర్త. ఉత్తమ నేపథ్య గాయకుడిగా నాలుగు సార్లు జాతీయ అవార్డును గెలుపొందారు.

మరణాలు

1943: శ్రీపాద కామేశ్వరరావు, రంగస్థల నటుడు, మరాఠీ, ఒరియా, తమిళ, ఫ్రెంచి, పంజాబీ నాటకాలను తెలుగులోకి అనువదించాడు.

1993: అల్బెర్ట్ సాబిన్, అమెరికాకు చెందిన ఓరల్ పోలియో వాక్సిన్ సృష్టికర్త.

2002: జి.ఎం.సి.బాలయోగి, ఆంధ్రప్రదేశ్ కు చెందిన పార్లమెంట్ సభ్యుడు, తొలి దళిత లోక్‌సభ స్పీకర్. (జ.1951)

2008: కుమారి, వాహినీ సంస్థ వారి దేవత, సుమంగళి వంటి చిత్రాలలో నటించిన నటీమణి.