Madipelli Mallesh : మృతి చెందిన కుటుంబానికి

TRINETHRAM NEWS

25కేజీ బియ్యం అందజేసిన సేవా స్పూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్
రామగుండం మార్చి-16//త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని రెండో డివిజన్ పీకే రామయ్య కాలనీకి చెందిన తంతుభాయ్ లక్ష్మీ అనే 16 సంవత్సరాల యువతి 10 రోజుల క్రితం మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు మృతురాలు గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్నట్లు తెలిసింది నిరుపేద కుటుంబానికి చెందిన తంతుభాయ్ లక్ష్మి దిశ దినకర్మ ఆదివారం జరుపుతున్నారని తెలుసుకొని సేవా స్పూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ సభ్యులు దేదావత్ వెంకన్న నాయక్ ద్వారా 25 కిలోల బియ్యం బాధిత కుటుంబానికి అందజేశామని అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ తెలిపారు ఈ కార్యక్రమానికి చేయూత నిచ్చిన ఫౌండేషన్ సబ్యలందరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని మల్లేష్ అన్నారు ఈ కార్యక్రమంలో పీకే రామయ్యా కాలని యువకులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

the family of the

You cannot copy content of this page

Scroll to Top