త్రినేత్రం న్యూస్ రామగుండం ప్రతినిధి… రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా బాధ్యతలు స్వీకరించిన మహంకాళి స్వామి సోమవారం పెద్దపల్లి టిఎన్జిఓ సంఘం గజ మాల మరియు శాలువతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. జిల్లాలో కీలకంగా వ్యవహరిస్తూ.. రామగుండం అభివృద్ధికి తాను అనునిత్యం కృషి చేస్తానని, ఉద్యోగ సంఘాలు ఇలా సత్కరించడం తనకి మరింత ప్రోత్సాహాన్ని అందించిందని కొనియాడారు మరియు ఉద్యోగులు అభివృద్ధికి ఎల్లవేళలా సహకరిస్తారని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా టిఎన్జీఓ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మరియు ఉద్యోగ సంఘాల జే ఏ సి చైర్మన్ బొంకూరి శంకర్ మాట్లాడుతూ.. అనునిత్యం ప్రజా సంక్షేమం, పట్టణాభివృద్ధిని కాంక్షించే నాయకులు మేయర్ కావడం శుభపరిణామమని, ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని ప్రజలలోకి తీసుకువెళుతూ ప్రభుత్వ గౌరవాన్ని రెట్టింపు చేసేలా ఉద్యోగులు కృషి చేస్తారని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ ఎడ్ల కొమురయ్య, పట్టణ అధ్యక్షులు అయిరెడ్డి సందీప్ రెడ్డి, మహేందర్ రెడ్డి, ప్రేమ్ సాగర్, రామగుండం అధ్యక్షులు జగన్, శ్రీకాంత్ , అన్వేష్, నాగరాజు, అంజి , రామగుండం సీ డీ పీ ఓ లావణ్య మరియు సూపర్వైజర్లు, తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


