జూన్ 26, 2026

WhatsApp Image 2024 01 24 at 10.35.07 AM

TRINETHRAM NEWS

నేడు తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక దర్శన టికెట్ల విడుదల

ఏప్రిల్ నెల దర్శన టికెట్లు, వసతి గదుల కోటా నేడు విడుదల

ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో దర్శన టికెట్లు

మధ్యాహ్నం 3 గంటల నుంచి వసతి గదుల బుకింగ్

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ నేడు విడుదల చేయనుంది. ఏప్రిల్ నెలలో దర్శనాల కోసం నేడు టికెట్లు జారీ చేయనున్నారు. ఈ ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో ఏప్రిల్ నెల కోటా టికెట్లు విడుదల చేస్తున్నామని టీటీడీ వెల్లడించింది. నేటి మధ్యాహ్నం 3 గంటలకు ఏప్రిల్ నెల వసతి గదుల కోటా విడుదల చేయనున్నామని తెలిపింది. శ్రీవారి భక్తులు ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకోవడానికి తమ అధికారిక వెబ్ సైట్ https://ttdevasthanams.ap.gov.in ను సందర్శించాలని టీటీడీ సూచించింది.

You cannot copy content of this page