TRINETHRAM NEWS

మహా కుంభమేళాకు వేళాయె!

Trinethram News : ప్రపంచంలోనే అతిపెద్ద హిందు ఉత్సవం మహాకుంభమేళకు వేళయింది, ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లే మహత్తర సమ్మేళనం సోమవారం నుండి ప్రారంభం కానున్నాయి,

ఈ రోజు ప్రయాగ్‌ రాజ్‌లో కుంభమేళా ప్రారంభమవుతుంది . ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే రైళ్లు, బస్సులు, ఫ్లైట్‌ బుకింగ్స్‌ ఫుల్‌ అయ్యాయి. 45 రోజుల పాటు సాగే ఈ కుంభమేళా కోసం దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు తరలివస్తారని భావిస్తున్నారు.

కుంభమేళాకు 40 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా ఉంది. కుంభ మేళా పర్వదినాల్లో ఉత్తరప్రదేశ్‌కు రూ. 2 లక్షల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని యూపీ సీఎం ప్రకటించారు. పన్నెండు పుష్కరాలకు వచ్చే మహాకుంభమేళా కావడంతో అత్యంత వైభ వంగా జరపాలని.. భక్తుల కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.

కుంభమేళా సందర్భంగా అఘోరాలు ప్రయాగ్‌రాజ్ చేరుకుంటున్నారు. ప్రయాగరాజ్‌ వీధుల్లో నాట్యాలు చేస్తూ భక్తులను ఉత్తేజపరుస్తున్నారు. మరోవైపు కుంభమేళాకు రకరకాల బాబాలు వస్తున్నారు. అందరి కన్నా ఇక్కడ కనిపిస్తున్న రుద్రాక్ష బాబా హైలైట్‌గా నిలుస్తున్నారు.

11వేల రుద్రాక్షలతో ఆయన అలంకరణ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మొత్తం 30కేజీల బరువున్న ఈ అలంకారంతోనే రుద్రాక్ష బాబా దర్శనమిస్తారు. ఆయన దగ్గర రుద్రాక్షను తీసుకుంటే అంతా మంచే జరుగుతుందని భక్తుల నమ్మకం.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App