త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి… వికారాబాద్ జిల్లాలో జరగనున్న మొదటి దశ ఎన్నికల దృష్ట్యా, జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర, ఐపీఎస్ ఈరోజు బొంరాస్‌పేట్ మండలంలోని డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసెప్షన్ సెంటర్ కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి, భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ పర్యవేక్షణలో భాగంగా, ఎస్పీ పరిగి డీఎస్పీ శ్రీనివాస్ మరియు కొడంగల్ సీఐ శ్రీధర్ రెడ్డిలతో కలిసి ఎన్నికల భద్రత కోసం తీసుకుంటున్న చర్యలు, పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు, రూట్ మొబైల్స్ నిర్వహణ, సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టి, మరియు కమ్యూనికేషన్ ప్లాన్‌పై చర్చించారు.పోలీస్ అధికారులకు ఎస్పీ మాట్లాడుతూ, ప్రతి ఒక్క బ్యాలెట్ బాక్స్ మరియు పోలింగ్ సామగ్రి డి ఆర్ సి నుండి పోలింగ్ కేంద్రాలకు సురక్షితంగా చేరే వరకు తప్పనిసరిగా ఎస్కార్ట్ కల్పించి పర్యవేక్షించాలని ఆదేశించారు.
రూట్ మొబైల్స్ మరియు పెట్రోలింగ్ సిబ్బందితో ప్రత్యేకంగా మాట్లాడిన ఎస్పీ , బందోబస్తులో అనుమానాస్పద వ్యక్తులు/వస్తువుల పట్ల అప్రమత్తత మరియు అత్యవసర పరిస్థితులలో స్పందించాల్సిన తీరు గురించి ముఖ్యమైన సూచనలు ఇచ్చారు. శాంతిభద్రతల పరిరక్షణకు, ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేందుకు పోలీసులు కట్టుబడి ఉండాలని ఎస్పీ స్పష్టం చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


