WhatsApp Image 2024 02 20 at 08.29.48
Trinethram News : ప్లకాశం : బేస్తవారిపేట మండలం పూసలపాడు సమీపంలోని అమరావతి – అనంతపురం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న కారు, ఆటో ఒకదానికొకటి ఢీకొన్నాయి..
ఆటోలో మంటలు చెలరేగి ముగ్గురు మరణించగా.. వారిలోఇద్దరు సజీవ దహనమయ్యారు. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి, ఆటో డ్రైవర్‌కి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం మార్కాపురం తరలించారు. మృతులంతా బెస్తవారిపేట మండలం బార్లకుంటకు చెందిన వెంకటేశ్వర్లు, చిన్న వెంకటేశ్వర్లు, శ్రీరాములుగా గుర్తించారు. ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..
