ట్రాక్టర్‌-కారు ఢీ.. ముగ్గురు మృతి

TRINETHRAM NEWS

Trinethram News : గుంటూరు: ట్రాక్టర్‌, కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. గుంటూరు జిల్లా ఏటుకూరు వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది..

క్షతగాత్రులను గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. మృతుల్లో ఓ చిన్నారి, ఇద్దరు మహిళలు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతులంతా మంగళగిరికి చెందిన వారిగా గుర్తించారు. ప్రత్తిపాడు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు..

You cannot copy content of this page

Scroll to Top