జూన్ 27, 2026

WhatsApp Image 2024 03 15 at 12.17.57 PM

TRINETHRAM NEWS

Trinethram News : నారాయణఖేడ్‌ : ఖేడ్‌ పట్టణంలో అనుమతి లేకుండా కొనసాగుతున్న మూడు ప్రైవేటు ఆసుపత్రులు సీజ్‌ చేసినట్లు జిల్లా ఇన్‌ఛార్జి వైద్యాధికారిణి గాయత్రీదేవి తెలిపారు. గురువారం ఆమె పట్టణంలోని ప్రైవేటు ఆసుత్రులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సురక్ష క్లినిక్‌, శ్రీసాయివాణి, హెల్త్‌పాయింట్ ఆసుపత్రులకు ఎలాంటి అనుమతులు లేవని గుర్తించి వాటిని సీˆజ్‌ చేసినట్లు పేర్కొన్నారు. హెల్త్‌పాయింట్ క్లినిక్‌లో 10 మంది వరకు రోగులు ఉండగా తనిఖీని పసిగట్టిన ఆసుపత్రి నిర్వాహకులు.. రోగులను అందులోనే ఉంచి తాళాలు వేసి వెళ్లారన్నారు. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించడంతో యాజమాన్యం ప్రతినిధులు వచ్చి తాళాలు తీసి రోగులను బయటకు పంపించామన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 30 వరకు అనుమతి లేని ఆసుపత్రులను సీˆజ్‌ చేసినట్లు వివరించారు. అన్ని ఆసుపత్రులు ఆయుష్మాన్‌ భారత్‌ ద్వారా అనుమతి పొందాల్సిందేనని స్పష్టం చేశారు…….

You cannot copy content of this page