
Trinethram News : హైదరాబాద్: సైబరాబాద్ పరిధిలో ఎస్‌వోటీ పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేసి వారిపై మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. జీడిమెట్లలో బిహార్‌కు చెందిన శిబుకుమార్ అనే యువకుడు కిరాణా దుకాణం ముసుగులో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. కూలీలు, విద్యార్థులకు వీటిని విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. మరోవైపు రామచంద్రాపురం బాలాజీనగర్‌లో సీతారామ్ అనే వృద్ధుడు, నిజాంపేట్‌లో చంద్రశేఖర్ అనే వ్యక్తి గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నట్లు గుర్తించారు. ఉత్తర్‌ప్రదేశ్, బిహార్ నుంచి వీటిని తీసుకువస్తున్నారని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి 250 ప్యాకెట్ల గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.
