ఇది దేశ ఆడ బిడ్డల పోరాటం – రెజ్లర్ సాక్షి మాలిక్
మహిళా రెజ్లర్లపై బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషన్ సింగ్ చేస్తున్న లైంగిక మరియు మానసిక దాడులకు గాను సాక్షి మాలిక్ బహిరంగ ఆరోపణలు చేశారు.
ఐతే ఈ ఆరోపణల నేపథ్యంలో భారత రెజ్లింగ్ సమాఖ్య కొత్త ప్యానెల్ ను బ్రిజ్ భూషణ్ సింగ్ అనుచరుడు సంజయ్ సింగ్ నేతృత్వంలో ఎన్నుకోవటం జరిగింది. ఐతే ఈ ఎన్నికతో రెజ్లింగ్ నుంచి స్వచ్ఛంద విరమణ చేస్తూ సాక్షీ మాలిక్ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే..
దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం భారత రెజ్లింగ్ సమాఖ్య కొత్త ప్యానెల్ ను సస్పెండ్ చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. దీనిపై సాక్షీ మాలిక్ ‘ ఇది మంచి దిశగా తొలి అడుగు మేము దేనికోసం పోరాడమన్నది ప్రభుత్వం మరింత అర్థం చేసుకుంటుందని ఆశిస్తున్నా.. మహిళా అధ్యక్షురాలు ఉంటే మహిళా రెజ్లలర్ కు మెరుగైన రక్షణ ఉండే అవకాశం వుంటుందని, ఇది దేశ బిడ్డలు, సోదరీమణుల కోసం చేసిన పోరాటం’ అని తెలిపారు. భారత రెజ్లింగ్ సమాఖ్య లో పురుషులు అధ్యక్షులుగా వద్దని ఆమె అభిప్రాయం.