రోడ్డు వేశారు విద్యుత్ పోల్ ఎర్త్ వైర్ మరిచారు

TRINETHRAM NEWS

రోడ్డుకు అడ్డంగా విద్యుత్ తీగ ఉన్న పట్టించుకోని కాంట్రాక్టర్, మరియు విద్యుత్ శాఖ సిబ్బంది.
చీకట్లో విద్యుత్ తీగ (ఎర్త్) కనబడక ప్రజలకు బాటసారులకు, వాహనాదారులకు ప్రమాదాలు జరిగితే, బాధ్యులు ఎవరు సామీ ???
డిండి (గుండ్ల పల్లి) జూన్ 30 త్రినేత్రం న్యూస్. ఇటీవల డిండి మండల కేంద్రంలోని చేపల మార్కెట్ నుండి పశువుల దవాఖాన వరకు కొత్తగా సీ సి రోడ్డు వేశారు. పశువుల దావకాన వద్ద ఉన్న విద్యుత్ స్తంభానికి ఉన్న ఎర్త్ వైర్ రోడ్డు మధ్యలో తీయకుండా అలాగే వదిలేసి రోడ్డు వేశారు.
ఈ రోడ్డు గుండా గ్రామ ప్రజలు, పశువుల దావఖాన కు వచ్చే వారు, పారిశ్రామిక శిక్షణ సంస్థ కు(ఐటీ ఐ) వచ్చే విద్యార్థు లు ప్రతి దినం ఈ రోడ్డు గుండా వస్తుంటారు. అకస్మాత్తుగా వస్తుంటే ప్రమాదాలు జరిగితే, దీనికి బాధ్యులు ఎవరని ప్రజలు అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు మరియు సిబ్బంది స్పందించి వెంటనే రోడ్డుకు మధ్యన ఉన్న తీగను (పోల్ ఎర్త్ వైర్)ను తొలగించి ప్రమాదాలు జరగకుండా చూడాలని అధికారులను,విద్యుత్ శాఖ సిబ్బంది నీ కోరుతున్నారు.

_విద్యుత్ సరఫరా సరిగా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు…

పేరుకే డిండి మండలకేంద్రం కానీ ఇక్కడ విద్యుత్ సరఫరా సరిగ్గా వుండదని ప్రజలు అనుకుంటున్నారు. వివిధ కార్యాలయాలకు,బ్యాంకులకు పనినిమిత్తం వచ్చే వాళ్లకు గంటలతరబడి ఎదురుచూపులు తప్పడంలేదని వినికిడి. విద్యుత్ అధికారులను డిండి మండల ప్రజలు సంప్రదిస్తే నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని అంటున్నారు. దీనికి లోపం ఎవరిలో వుందో విద్యుత్ అధికారులకే తెలియాలి . ఇంతకు ముందు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా వుండటం ఎలా ఇప్పుడులేకపోవడం ఎట్లా అని ప్రజలు విద్యుత్ అధికారులను ప్రశ్నిస్తున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

They built the road

You cannot copy content of this page

Scroll to Top