
తేదీ : 17/02/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); బలవంతపు ఆ సహజ శృంగారం భార్యపై భర్త చేస్తే నేరం కాదని 2017వ సంవత్సరంలో జరిగిన ఘటనపై చత్తిస్ గౌడ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు వలన మహిళలపై లైంగిక హింస పెరిగే ప్రమాదం ఉంది. పెళ్లి అని లైసెన్స్ మానవ మృగాలకు స్వేచ్చని ఇస్తోందని స్త్రీని లైంగిక కోరికలు తీర్చే వస్తువుగా చూడడంలో ప్రతి ఒక్కరూ మైండ్ సెట్ మార్చుకోవాలని సి.పి.ఐ.యం. యల్ లేబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి. హరినాథ్ విమర్శించడం జరిగింది. స్త్రీ సమ్మతి లేకుండా తాకటం నేరం. మనసును గాయపరిచే ఎవరినైనా శిక్షించవలసిందేనని .
ఉన్నత న్యాయస్థానం తీర్పుపై పున: సమీక్ష చేసి బాధితురాలికి న్యాయం చేయాలని హరినాథ్ విజ్ఞప్తి చేశారు. ఆ రాష్ట్రంలో జరిగిన సంఘటన భర్త మైనారిటీ తీరని భార్యపై బలవంతపు ఆ సహజ శృంగారం చేయడం ద్వారా గాయపడి మరణించడం జరిగిందని వైద్యులు రిపోర్ట్ ఆధారంగా కింది కోర్టు నిందితునికి 10 సంవత్సరాలు శిక్ష విధించడం జరిగింది.
బాధితుడు హైకోర్టుకు వెళ్ళాగా పెళ్లి చేసుకున్న భర్త ఆ సహజ శృంగారం చట్టబద్ధమైనదిగా అది నేరం కాదని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వడం బాధాకరమని విచారం వ్యక్తం చేయడం జరిగింది. నిండు ప్రాణం బలి అయినా న్యాయమూర్తుల్లో కొంచెం కూడా పశ్చాత్తాపం లేదంటే న్యాయ వ్యవస్థ పట్ల ప్రజలకు ఉన్న నమ్మకం సడలే ప్రమాదం ఉందన్నారు.
అమృత్యుత్సవాలు జరుపుకుంటున్న వేల “బేటి బచావో పేటి పడావో’ “నినాదాలతో ఢిల్లీ ప్రధాని నుండి చోట నాయకుడి వరకు నినాదాలు చేస్తుంటే ఆ బలాలపై అత్యాచారాలు, హత్యలతో ప్రాణాలు హరి అంటుంటే స్త్రీ జాతికి మీరు ఇచ్చే గౌరవం ఇదేనా? యత్ర నారీ పూజ్యేత తత్ర దేవత : అని కీర్తించే సనాతన వాదులు స్త్రీ జాతికి జరిగే అన్యాయాన్ని ప్రశ్నించకపోవడం సమర్థింపు కాదా? గృహ హింస చట్టాలు కాలం చెల్లినట్లేనా ? అని హరినాథ్ ప్రశ్నించడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
