జూన్ 26, 2026

WhatsApp Image 2024 01 22 at 9.03.19 AM

TRINETHRAM NEWS

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. దీంతో వై నాట్ 175.. నినాదంతో మరోసారి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు వైసీపీ అధినేత, సీఎం జగన్ వ్యూహాలతో ముందుకువెళ్తున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే నాలుగు విడతల్లో ఇన్‌ఛార్జులను మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే, అభ్యర్థుల ఎంపికను దాదాపుగా ఓ కొలిక్కి తీసుకొచ్చిన అధికార వైసీపీ.. ఎన్నికల ప్రచారంపై ఫోకస్ పెట్టింది. ఈ నెల 27న ఎన్నికల శంఖారావాన్ని ఉత్తరాంధ్ర నుంచి పూరించాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. ఇందుకోసం భీమిలి, ఆనందపురం మండలాల్లో పలు లే అవుట్లను పరిశీలించారు. ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లను పార్టీ ముఖ్యనేత, ఉత్తరాంధ్ర వైసీపీ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు.

You cannot copy content of this page