ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. దీంతో వై నాట్ 175.. నినాదంతో మరోసారి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు వైసీపీ అధినేత, సీఎం జగన్ వ్యూహాలతో ముందుకువెళ్తున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే నాలుగు విడతల్లో ఇన్‌ఛార్జులను మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే, అభ్యర్థుల ఎంపికను దాదాపుగా ఓ కొలిక్కి తీసుకొచ్చిన అధికార వైసీపీ.. ఎన్నికల ప్రచారంపై ఫోకస్ పెట్టింది. ఈ నెల 27న ఎన్నికల శంఖారావాన్ని ఉత్తరాంధ్ర నుంచి పూరించాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. ఇందుకోసం భీమిలి, ఆనందపురం మండలాల్లో పలు లే అవుట్లను పరిశీలించారు. ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లను పార్టీ ముఖ్యనేత, ఉత్తరాంధ్ర వైసీపీ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది
Related Posts
Pawan : YCP సమోసాలకే రూ.9 కోట్లు ఖర్చు పెట్టింది : పవన్
TRINETHRAM NEWS YCP సమోసాలకే రూ.9 కోట్లు ఖర్చు పెట్టింది : పవన్ Trinethram News : Andhra Pradesh : Nov 26, 2024, వైసీపీ ప్రభుత్వం సమోసాల కోసమే రూ.9 కోట్లు ఖర్చు చేసిందని డిప్యూటీ సీఎం పవన్…
Rajya Sabha Seats : ఏపీలో 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ
TRINETHRAM NEWS ఏపీలో 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ Trinethram News : Andhra Pradesh : Nov 26, 2024, ఏపీలో ఖాళీగా ఉన్న 3 రాజ్యసభ స్థానాల ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. డిసెంబర్ 3న నోటిఫికేషన్ వెలువడనుంది.…