Trinethram News : హైదరాబాద్: హైదరాబాద్లో శాంతిభద్రతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం వారం రోజుల్లోనే రెండు పెద్ద సంఘటనలు చోటు చేసుకోవడం పట్ల ధ్వజమెత్తారు. పగటిపూట నగరంలోని జ్యువెలరీ షాపులో గన్పాయింట్ దోపిడీ జరగడం, కూకట్పల్లిలో 12 ఏండ్ల బాలికను దారుణంగా హత్య చేయడం ప్రజలలో భయాందోళనలు కలిగించాయన్నారు.
కాంగ్రెస్ పాలనలో ప్రజా భద్రతకు ముప్పు పొంచి ఉందని.. శాంతిభద్రతలపై ప్రభుత్వం కనీస దృష్టి సారించడం లేదంటూ మండిపడ్డారు. సమర్థవంతమైన తెలంగాణ పోలీసులను రాజకీయ కక్ష సాధింపులకు వాడుకోవడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని విమర్శించారు. ప్రజలకు భద్రత కావాలి కానీ భయం కాదన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


