తుపానుగా మారిన తీవ్ర వాయుగుండం.. ఏపీలో పలు జిల్లాలకు అతి భారీ వర్ష సూచన
తుపాను నేపథ్యంలో విశాఖ రుషికొండ బీచ్‌లో ఒడ్డుకు చేర్చిన వివిధ రకాల పడవలు
Trinethram News : విశాఖపట్నం, చెన్నై : నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం శుక్రవారం మధ్యాహ్నానికి తుపానుగా మారినట్లు భారత వాతావరణశాఖ పేర్కొంది..
దీనికి ఫెయింజల్‌గా నామకరణం చేశారు. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ శనివారం మధ్యాహ్నానికి కారైకాల్ (పుదుచ్చేరి), మహాబలిపురం (తమిళనాడు) మధ్యలో తీరం దాటే అవకాశముందని వెల్లడించింది. ఆ సమయంలో తీరం వెంబడి గరిష్ఠంగా గంటకు 90 కి.మీ వేగంతో గాలులు వీస్తాయంది. ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదమున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ సూచించారు..
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాల్లో ఆకస్మికంగా వరదలు వచ్చే ప్రమాదముందని హెచ్చరించారు. సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో మత్స్యకారులు సోమవారం వరకు వేటకు వెళ్లరాదని సూచించారు. కృష్ణపట్నం పోర్టుకు మూడో నంబరు, విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కాకినాడ, గంగవరం పోర్టులకు రెండో నంబరు హెచ్చరికలు జారీ చేశారు..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App