ఆదివాసి గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు, పి. అప్పలనరస
ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్, అల్లూరిజిల్లా(పాడేరు ) ఆదివాసీ గిరిజన సంఘం
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కమిటీ,
జిల్లా రెవెన్యూ వ్యవస్థ ను బలోపేతం చేయాలి.
1/70 చట్టం అమలు కట్టుదిట్టం చేయాలి.
అల్లూరి సీతారామరాజు జిల్లా లో, రెవెన్యూ వ్యవస్థ బలోపేతం కోసం నూతనంగా బదిలీ లో బాగంగా తహశీల్దార్ లను, వెంటనే నియమించాలని ఆదివాసీ గిరిజన సంఘం, జాతీయ కార్యవర్గ సభ్యులు పి.అప్పల నర్శ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.
పాడేరు ఆదివాసీ గిరిజన సంఘం కార్యాలయం లో విలేఖర్లతో పి.అప్పల నర్శ మాట్లాడుతూ ఆదివాసీల పేరిట కొత్త జిల్లా లు ఏర్పాటు చేసిన ప్రభుత్వం, పరిపాలన మాత్రం గాలికి వదిలేసింది. సాధారణ బదిలీ లో బాగంగా ఏజెన్సీలో ఉన్న తహశీల్దార్ లల్లో రెండు సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసిన వారికి, మైదన ప్రాంతంలో బదిలీ చేశారు.వారి స్థానంలో కొత్తగా తహశీల్దార్లు ను నియమించడం లేదు. ఏజెన్సీ ప్రాంతాల్లో విధులు నిర్వర్తించేందుకు ఇష్టపడడం లేదని ప్రభుత్వం నియామకం చేయడం లేదు. 50 సంవత్సరం వయోబారం తో ఉన్నవారిని ఏజెన్సీలో తహశీల్దార్ గా నియమించ రాదని ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను దిక్కరించి విశాఖ జిల్లా కలెక్టర్ ముగ్గురు తహసీల్దార్లను అల్లూరి సీతారామరాజు జిల్లా కు బదిలీ చేశారు. బదిలీ పై వచ్చిన వారు వారి స్థానంలో జ్వాయినింగ్ కాకుండా , మాకు వయో బారం గా ఉందని హై కోర్టు ను ఆశ్రయించి జ్యాయి నింగ్ కాలేదు.
దీని ఫలితంగా తహశీల్దార్ వ్యవస్థ బలహీనమై ఆదివాసీలకు రెవెన్యూ సేవలు అందడం లేదు. ముఖ్యంగా 1/70 చ ట్టాన్ని దిక్కరించిన, తహశీల్దార్లు ఏజెన్సీలో కొనసాగితే ఆదివాసీ హక్కులు, చట్టాలకు తీవ్రమైన ప్రమాదం ఉంది.ఇప్పుడు ఉన్న రెవెన్యూ వ్యవస్థ వల్ల విచ్చలివిడిగా అక్రమ నిర్మాణం పెరిగింది. కనీసం ఎల్.టి.అర్ కేసు నమోదు చేసే అధికార్లు కూడా లేకపోవడం తోనే, ఆదివాసీ ప్రాంత పరిపాలన వ్యవస్థ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏజెన్సీ ప్రాంతాల్లో తక్షణమే నిబంధనల ప్రకారం కొత్త తహసీల్దార్ల నియమించాలి. రెవెన్యూ వ్యవస్థ బలోపేతం చేయడానికి ప్రభుత్వం పరిపాలన వ్యవస్థ కృషి చేయాలని, ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ చేస్తోంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App