వికారాబాద్ రైల్వే జంక్షన్ అభివృద్ధి పనులకు రేపు ప్రధాని శంకుస్థాపన!

TRINETHRAM NEWS

వికారాబాద్ :ఫిబ్రవరి 25
అమృత్ భారత్ స్టేషన్ల అభివృద్ది పథకంలో భాగంగా ఈ నెల 26న దేశవ్యాప్తంగా పలు రైల్వేస్టేషన్లలో అభివృద్ది పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయను న్నారు.ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఎంపిక చేసిన 15 రైల్వే స్టేషన్లో ఈ కార్యక్రమంలో ప్రారంభించనున్నారు.వికారాబాద్ జంక్షన్ ను సైతం ఇందులో భాగంగా ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు.24.35 కోట్ల రూపాయలతో ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. దీనిలో భాగంగా ఏపీలో 34, తెలంగాణలో 15 రైల్వేస్టేష న్లను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది.వీటి కోసం రూ.843.54 కోట్లను కేటాయించారు.ఆ రైల్వేస్టేషన్లలో అభివృద్ది పనులకు 26న మోదీ శంకుస్థాపన చేయను న్నారు.

You cannot copy content of this page

Scroll to Top