Gaddam Prasad Kumar : వికారాబాద్ జిల్లా కేంద్రంలోని నర్సింగ్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక శిక్షణా

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్… ప్రజా పాలన ప్రగతిప్రణాళిక శిక్షణ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ దీపక్ తివారి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో కలిసి నూతనంగా ఎన్నికైన సర్పంచులు, కౌన్సిలర్లకు దిశానిర్దేశం చేశారు.
రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజారంజక పాలన సాగుతోందని, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో స్థానిక ప్రజాప్రతినిధులు కీలక పాత్ర పోషించాలని స్పీకర్ సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు బండికి రెండు చక్రాల ల కలిసి పనిచేసి జిల్లా అభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాలపై అర్హులందరికీ అవగాహన కల్పించాలని అన్నారు, ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ స్నేహ మెహరా, అదనపు కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, మున్సిపల్ చైర్ పర్సన్లు గడ్డం అనన్య, పట్లోళ్ల నీరజ, రజిత వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

The Prajapalana Pragathi Plan training program

You cannot copy content of this page

Scroll to Top